Reverse Clock: గడియారంలో ముళ్లు ముందుకు కంటే వెనక్కి వెళ్లడం అరుదుగా కనిపించే విషయం. అయితే, ప్రపంచంలో అమెరికా సహా దాదాపు 70 దేశాలు ప్రతి సంవత్సరం డేలైట్ సేవింగ్ టైమ్ అనే విధానంలో ఇది పాటిస్తాయి. వసంత కాలం (మార్చి) వచ్చినప్పుడు గడియారాన్ని ఒక గంట ముందుకు జరిపేస్తారు. అదే, శరదృతువు (నవంబర్) మొదలయ్యాక ఆ ముందుకు పెట్టిన గంటను మళ్లీ తిరిగి వెనక్కి తీసుకుంటారు.
ఈ ప్రక్రియలో భాగంగా ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి గడియారం ముళ్లు ఒక గంట వెనక్కి వెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
