Heart Block Symptoms: ఇప్పటి ఆధునిక జీవనశైలిలో గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. అందుకే హృదయాన్ని కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సందర్భంలో హార్ట్ బ్లాక్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. గుండెలో బ్లాక్ ఏర్పడితే అది గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉంది. హార్ట్ బ్లాక్ మూడు దశల్లో ఏర్పడుతుంది. మొదటి దశలో పెద్దగా సమస్య కనిపించకపోవచ్చు, కానీ మూడో దశకు చేరితే గుండె స్పందన ఆగిపోవడం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవచ్చు. ఇలా జరిగితే ప్రాణాపాయం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
విద్యుత్ సంకేతాలు గుండె కింది గదులకు సరిగ్గా చేరకపోతే హార్ట్ బ్లాక్ ఏర్పడుతుంది. గుండెలో అడ్డంకులు వచ్చినప్పుడు శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. వాటిని అర్థం చేసుకోకపోతే చివరికి గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీస్తుంది.
శ్వాసలో ఇబ్బంది: తరచూ శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తే, దానిని చిన్న సమస్యగా తీసుకోకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మూర్ఛపోవడం: కారణం లేకుండా పదే పదే మూర్ఛపోవడం కూడా గుండె అడ్డంకికి సంకేతం కావచ్చు. గుండెపోటు సమయంలో హృదయ స్పందన రేటు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది.
ఛాతీ నొప్పి: ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి అనిపించడం గుండెలో బ్లాక్ ఉన్న సూచన. గ్యాస్ లేదా అసిడిటీ అని భావించి ఇంటి చిట్కాలతో విస్మరించి పెట్టకూడదు. నొప్పి ఎక్కువ సేపు ఉంటే తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.
తలతిరగడం: ఏ స్పష్టమైన కారణం లేకుండా తరచూ తలతిరగడం కూడా హార్ట్ బ్లాక్‌కు సంబంధించిన లక్షణం కావచ్చు.
వికారం – వాంతులు: కారణం లేకుండా వికారం లేదా వాంతులు రావడం కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఇవి చిన్నసమస్యలు అంటూ నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.
మీకు ఈ లక్షణాలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే ఆలస్యం చేయకుండా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవడం మంచిది.
Also Read: Telangana: మరో ఉప ఎన్నిక తథ్యం..! రాజీనామా వైపే దానం మొగ్గు?
Heart Block Symptoms: మార్నింగ్ లేవగానే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..?
