Ultraviolet: అల్ట్రావయొలెట్ తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా హైదరాబాద్‌లో మరో అత్యాధునిక ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్ మార్కెట్లో విజయవంతంగా కొనసాగుతున్న ఈ సంస్థ, తాజాగా ఏర్పాటు చేసిన ఈ యూవీ స్పేస్ స్టేషన్‌తో తెలంగాణలో రెండో అనుభవ కేంద్రాన్ని కలిగి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇరవై నగరాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న అల్ట్రావయొలెట్, పనితీరు ఆధారిత పర్యావరణహితమైన విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించడంలో తన నిబద్ధతను మరోసారి రుజువు చేసింది.
సన్‌రైజ్ మోటోహైవ్ (Sunrise Motohive LLP) డీలరు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూవీ స్పేస్ స్టేషన్లో అల్ట్రావయొలెట్ యొక్క పర్ఫార్మెన్స్ మోటర్‌సైకిల్స్ – F77 మాక్2, F77 సూపర్‌స్ట్రీట్ లభ్యం. 3S ఫెసిలిటీగా రూపొందించిన ఈ సెంటర్లో టెస్ట్ రైడ్లు, సేల్స్, సర్వీస్, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, మోటర్‌సైకిల్ యాక్సెసరీలు అన్నీ ఒకే చోట లభిస్తాయి.
F77 మాక్2 మరియు F77 సూపర్‌స్ట్రీట్ మోడల్స్ 40.2hp పవర్ట్రైన్, 100Nm టార్క్ శక్తితో కేవలం 2.8 సెకన్లలోనే 0 నుండి 60 కి.మీ. వేగాన్ని చేరుకుంటాయి. 10.3kWh బ్యాటరీ దన్నుతో ఒక్కసారి చార్జ్ చేస్తే 323 కి.మీ. IDC రేంజ్ అందిస్తాయి.

అల్ట్రావయొలెట్ సీటీవో & సహవ్యవస్థాపకుడు నీరజ్ రాజ్‌మోహన్ మాట్లాడుతూ –
“హైదరాబాద్‌లో మా రెండో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం కేవలం విస్తరణకే కాదు, ఇక్కడి ప్రోగ్రెసివ్ ఈవీ కమ్యూనిటీ నుంచి నేర్చుకుంటూ వారితో కలిసి ఎదగడానికి కూడా ఒక గొప్ప అవకాశం. పనితీరు, ఆధునిక డిజైన్, ఇంజినీరింగ్‌కి విలువనిచ్చే నగర వాసులతో కలిసి పనిచేయడం ద్వారా మా ఉత్పత్తులపై మరింత నమ్మకాన్ని ఏర్పరచుకుంటాం” అని అన్నారు.
కంపెనీ కాలానుగుణంగా కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడుతూ ఎలక్ట్రిక్ మొబిలిటీని పునర్నిర్వచిస్తోంది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన Gen3 పవర్ట్రైన్ ఫర్మ్‌వేర్ మరియు బాలిస్టిక్+ ఫీచర్లు పాత F77లకే కాకుండా కొత్త కస్టమర్లకూ ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తాయి. వీటితో వాహనాలు వేగవంతమైన రెస్పాన్స్, మెరుగైన యాక్సెలరేషన్, స్టార్ట్‌లో శక్తివంతమైన సర్జ్ను అందిస్తాయి.
2024లో ప్రవేశపెట్టిన F77 మోడల్స్‌లో ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (UVDSC), 10 స్థాయుల రీజెనరేటివ్ బ్రేకింగ్, హిల్-హోల్డ్ అసిస్ట్, వయొలెట్ A.I. వంటి ఆధునిక భద్రతా ఫీచర్లను అందించారు.
ఇటీవల అల్ట్రావయొలెట్ ప్రవేశపెట్టిన రెండు వినూత్న వాహనాలు – ప్రపంచంలోనే అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్ “టెసెరాక్ట్ (Tesseract)”, అలాగే ఉత్సాహభరిత రైడర్ల కోసం రూపొందించిన అద్భుత ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ “షాక్వేవ్ (Shockwave)” విశేష స్పందన పొందాయి.
🔹 హైదరాబాద్ యూవీ స్పేస్ స్టేషన్ చిరునామా:
సాయి నగర్ రోడ్, రాక్ టౌన్ రెసిడెంట్స్ కాలనీ, ఎల్బీ నగర్, హైదరాబాద్ – 500068.
