Hyderabad: హైదరాబాద్ నగరంలో వరుసగా విద్యుదాఘాత ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం రాత్రి రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం ఇంకా మరువకముందే, మరో రెండు చోట్ల విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
పాతబస్తీ బండ్లగూడలో గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలను కర్రతో పైకెత్తే ప్రయత్నంలో షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఇదే విధంగా అంబర్పేటలో కూడా రామ్ చరణ్ అనే యువకుడు విగ్రహాన్ని తరలించే సమయంలో అడ్డు వచ్చిన విద్యుత్ తీగలను తొలగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
రెండు రోజుల వ్యవధిలో మూడు ప్రాణాంతక ఘటనలు జరగడం నగరాన్ని విషాదంలో ముంచేసింది. విగ్రహాలను తరలించే సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
