TGPSC: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థుల కోసం టీఎస్‌పీఎస్సీ తాజా ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ ఫలితాలను ప్రకటించిన కమిషన్, ఇప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను వెల్లడించింది. నవంబర్ 10 నుంచి 26 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీ (మునుపటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ)లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది.
వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్ల జాబితాను https://www.tgpsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సూచించిన షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల స్వయంగా సంతకం చేసిన ఫోటో కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలి.
తీసుకురావాల్సిన పత్రాలు:
-
అప్లికేషన్ ఫామ్
-
హాల్ టికెట్
-
ఆధార్/ఓటర్ కార్డు/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/సర్వీస్ ఐడీ/పాన్ కార్డు
-
విద్యా అర్హత పత్రాలు
-
పదో తరగతి మెమో
-
1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు లేదా రేసిడెన్సీ సర్టిఫికేట్
-
కుల ధ్రువీకరణ పత్రం
-
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (వర్తిస్తే)
-
దివ్యాంగ సర్టిఫికేట్ (వర్తిస్తే)
-
క్రీడా రిజర్వేషన్ ఉంటే సంబంధిత పత్రాలు
గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 50.24% మంది హాజరయ్యారు. మూడు పేపర్లలో మొత్తం 450 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. ప్రతి పేపర్ 150 మార్కులతో, 150 ప్రశ్నలు ఉండేవి. అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులు పోస్టులకు పరిగణనలోకి వస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నియామకపత్రాలు ఇస్తారు.
