TG Model Schools: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తాజాగా ప్రకటించారు. ఈ ప్రకారం జనవరి 28వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 28, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ఏప్రిల్ 19న రాష్ట్రవ్యాప్తంగా నిర్ణయించిన పరీక్షా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుంది.
ఆరో తరగతి ప్రవేశాలతో పాటు, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్ల భర్తీ కోసం కూడా ఇదే పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ సీట్ల కోసం బాలురు, బాలికలు ఇద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మరిన్ని వివరాలను అధికారిక లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలంగాణ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
