Peacock Curry : రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెమలి కూర రెసిపీ వీడియోను తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినందుకు యూట్యూబర్‌పై కేసు నమోదైంది. యూట్యూబర్, తన ఛానెల్‌కు ఎక్కువ వ్యూస్ ను సంపాదించడానికి ఈ పని చేశాడని, ప్రాథమిక విచారణ ఆధారంగా అటవీ అధికారి ఒకరు తెలిపారు.
YouTuber Pranay Kumar faces backlash for posting a "Peacock Curry Recipe" The video, promoting illegal poaching of peacocks and wild boar, has drawn criticism from animal rights activists. #Telangana #PeacockCurry #YouTubepic.twitter.com/mv9LM6HLrj
— The Munsif Daily (@munsifdigital) August 11, 2024
నెమలి కూర ఎలా వండాలో ఓ వ్యక్తి తన ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేశాడని సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారుల బృందం తంగళ్లపల్లి గ్రామానికి చేరుకుని ఆ వ్యక్తి ఇంట్లోని కూరను స్వాధీనం చేసుకుంది. జంతు హక్కుల కార్యకర్తలు ఈ సమస్యను లేవనెత్తడంతో వీడియోను కూడా తీసివేశారు.