Telangana: యాదాద్రి భువనగిరి జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వలిగొండ మండలం గోపరాజుపల్లిలో అంగన్వాడీ టీచర్ సాలిగంజి మణియమ్మ అనే మహిళ పోస్టల్ బ్యాలెట్‌లో తన ఓటు హక్కు వినియోగించుకొని డ్యూటీ చేయాల్సి ఉండగా సడెన్‌గా గుండెనొప్పి అని చెప్పి సెలవు తీసుకోని తన స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున పోలింగ్ బూత్ వద్ద ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోపక్క తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈ రోజు ఉ.7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.. పోలీసులు భారీ బందోబస్తుతో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
