Suprem Court: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం బిగ్ షాక్

Supreme Court Issues Notice To Speaker Gaddam Prasad

Supreme Court Issues Notice To Speaker Gaddam Prasad

Suprem Court: తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్ట్ ఆదేశాలను స్పీకర్ అమలు చేయలేదని ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌ను కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌తో ట్యాగ్ చేస్తూ సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. అనంతరం కేసును ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది.

ఇంతకుముందే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం ఇచ్చారు. వారు పార్టీ మారలేదని తేల్చుతూ ఆ పిటిషన్లను కొట్టివేశారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తమవడంతో విషయం సుప్రీం కోర్టుకు చేరింది.

గత విచారణలో, కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్ నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. అలాగే స్పీకర్‌కు నోటీసులు జారీ చేయాలని కూడా పేర్కొంది. ఇదే సమయంలో “ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికుంది? కోర్టుకా? లేక స్పీకరకా?” అనే కీలక ప్రశ్నను ధర్మాసనం లేవనెత్తింది.

ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా, ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ మూడు నెలలు నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: Earthquake: జమ్మూ–కశ్మీర్‌ను కుదిపేసిన భూకంపం

Suprem Court: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం బిగ్ షాక్