Aghori Srinivas: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘అఘోరీ శ్రీనివాస్’ ఘటనను అంత తేలికగా మర్చిపోవడం కష్టం. మగవాడైనప్పటికీ లేడీ అఘోరీగా మారి, మాయ మాటలతో అమాయకులను మోసం చేస్తూ అతి తక్కువ సమయంలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. అంతేకాదు, మహిళలను ప్రభావితం చేయడంలో కూడా అతడు చాలా చాకచక్యంగా వ్యవహరించాడు.
శ్రీ వర్షిణి అనే యువతిని తన మాటలతో మాయ చేసి తన వెంట తిరిగేలా చేసుకున్నాడు. దాదాపు రెండు నెలల పాటు ఆమె అతనితో కలిసి ప్రయాణించింది. వర్షిణి కోసం ఆమె కుటుంబ సభ్యులు వెతకని చోటు అంటూ లేదు. అలా మోసం చేసి ఆమెను వెంట తీసుకెళ్లాడు. చివరకు అతని అక్రమాలపై సమాచారం అందడంతో పోలీసులు అఘోరీ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, రెండు నెలలు అతనితో కలిసి ఉన్న శ్రీ వర్షిణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన అనుభవాలను వెల్లడించింది.
ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. ఆమె మాట్లాడుతూ, “రెండు నెలల పాటు నేను అతనితోనే ఉన్నాను. దేవాలయాలకు తీసుకెళ్లేవాడు, అక్కడ ప్రసాదాలు తీసుకునేవాడు. నిద్ర రావాలంటే ఎక్కడైనా పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపి పడుకునేవాడు. అతనికి మంచి పేరు ఉండడంతో భక్తులు కారు మీద ఉన్న స్టిక్కర్లు చూసి దగ్గరకు వచ్చేవారు. కొందరు 500, మరికొందరు వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. కారు ఫుల్ ట్యాంక్ చేయించడం, భోజనం పెట్టడం, ఖరీదైన బట్టలు కొనిచ్చడం కూడా చేసేవారు. రోడ్డుపై ప్రయాణిస్తుండగానే ఎవరో ఒకరు డబ్బులు ఇస్తూనే ఉండేవారు. ఇలా రోజుకు సుమారు 25 నుంచి 30 వేల రూపాయలు సంపాదించేవాడు. పెట్రోల్ ఫ్రీ, డబ్బు ఫ్రీ, భోజనం ఫ్రీ… ఏసీ వేసుకుని కారు లోపల పడుకోవడమే అతని పని” అని చెప్పింది.
ఇంత జరుగుతుంటే అతన్ని ఎప్పుడైనా ప్రశ్నించాలనే ఆలోచన రాలేదా? అని యాంకర్ అడగగా, వర్షిణి ఇలా స్పందించింది. “ఆశ్రమం నిర్మిస్తానని చెప్పేవాడు. అప్పట్లో నేను అతన్ని గుడ్డిగా నమ్మేశాను. ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాను. అతడే నా ప్రపంచం అన్నట్టుగా అనిపించేది. అందుకే అన్నీ నమ్మేదాన్ని” అని తెలిపింది.
మరి కుటుంబ సభ్యులు చాలా కష్టపడి మూడు వారాల తర్వాత నిన్ను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కూడా ఎందుకు మళ్లీ వెళ్లిపోయావు? అని ప్రశ్నించగా, “పూర్తిగా పారిపోయాను అని చెప్పలేను. మధ్యలో కొంతమంది ఉన్నారు. వాళ్ల కారణంగానే నేను వెళ్లాల్సి వచ్చింది” అని వర్షిణి చెప్పుకొచ్చింది.
Aghori Srinivas: ‘అఘోరి’ ఒక్క రోజు సంపాదనతో నెల రోజులు బ్రతికేయొచ్చు!