Curry Puff: వ్యాక్.. అమ్మో కర్రీపఫ్ లో పాముపిల్ల

snake in curry puff at jadcherla

snake in curry puff at jadcherla

Curry Puff: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ బేకరీలో కర్రీ పఫ్‌లో చనిపోయిన పాముపిల్ల కనిపించిన ఘటన మంగళవారం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సీఐ కమలాకర్ వివరించారు.

జౌఖీ నగర్‌కు చెందిన శ్రీశైల తన పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్తూ, ఠాణా సమీపంలోని ఓ బేకరీలో ఆగి ఎగ్ పఫ్, కర్రీ పఫ్ కొనుగోలు చేశారు. పిల్లలు ఎగ్ పఫ్‌ను బేకరీ వద్దే తిన్నారు. ఇంటికి చేరిన తర్వాత మహిళ కర్రీ పఫ్ తినేందుకు సిద్ధమవుతుండగా, అందులో చనిపోయిన పాముపిల్ల కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.

వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్ బేకరీని సందర్శించి విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్‌కు తెలియజేశామని, వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో జడ్చర్లలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: Undermine: అందరూ మిమ్మల్ని చులకనగా చూస్తున్నట్టు అన్పిస్తోందా.. అయితే ఇలా చేయండి

Curry Puff: వ్యాక్.. అమ్మో కర్రీపఫ్ లో పాముపిల్ల