Temples: ఆలయాల్లో ఇకపై అవి నిషేధం .. మర్చిపోయి తీసుకెళ్లారో మీ జేబు ఖాళీ అయినట్టే

Single-use plastic banned in temples across state

Single-use plastic banned in temples across state

Temples: ఆలయాల్లో ప్రసాదం తీసుకోవడం, పూజా సామగ్రి తీసుకురావడం, పళ్లు, పూలు సమర్పించడం వంటి ప్రతి సందర్భంలోనూ ఇప్పటి వరకు ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. ఇకపై అలాంటివి అనుమతించబోమని దేవదాయశాఖ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆలయ ప్రాంగణంలోకి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లు తీసుకువస్తే తప్పనిసరిగా జరిమానా విధించనున్నారు. దీనికి సంబంధించిన జి.ఓ.ను దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈ నెల 8న జారీ చేశారు.

ఈ ఆదేశాల అమలుకు ఉమ్మడి గుంటూరు జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. పూజా సామగ్రి నుంచి ప్రసాదం అందించే వరకు ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదని ఆలయ సిబ్బందికి సూచనలు అందిస్తున్నారు. దేవదాయశాఖ అందించే ప్రసాదాన్ని ఇకపై అరటిఆకు కప్పుల్లోనే ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే, 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్ల విక్రయాన్ని ఆలయ దుకాణ సముదాయాల్లో పూర్తిగా నిషేధిస్తున్నారు. రోజువారీ తనిఖీలు చేసి, ఈ నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

త్రాగునీటిని కూడా ఇకపై స్టీల్ గ్లాసుల్లోనే అందించనున్నారు. తాగునీటి బాటిళ్లపై కూడా కఠిన నియంత్రణ ఉండనుంది. పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం కోసం ప్రత్యేక కవర్లు వాడుతున్నట్లు ఈవో అమర్ నాధ్ తెలిపారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించేందుకు భక్తుల్లో అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. దుకాణాల వద్ద “ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దు” అనే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. రాబోయే రోజుల్లో ఆలయాలు మరింత పర్యావరణహితంగా మారతాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: Cinema: ‘143’ సినిమా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..

Temples: ఆలయాల్లో ఇకపై అవి నిషేధం .. మర్చిపోయి తీసుకెళ్లారో మీ జేబు ఖాళీ అయినట్టే