Suprem Court: ఎంబీబీఎస్ లో స్థానిక కోటాలో సీటు పొందాలంటే, నీట్ పరీక్ష రాయే ముందు విద్యార్థులు కనీసం నాలుగేళ్లు తెలంగాణలోనే చదివి ఉండాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 33పై సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. విద్యార్థులు రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే… ఇకపై వారు స్థానికులుగా పరిగణించరా? అనే ప్రశ్నను కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి వేసింది.
ఈ నియమాన్ని 2028 నుంచే అమలు చేయడం ఎందుకు కుదరదు? అని ప్రశ్నిస్తూ, విద్యార్థులకు ఇలాంటి నిబంధనలు ముందే తెలియజేయాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. ఈ అంశంపై అన్ని వాదనలు ఎల్లుండికల్లా పూర్తి చేసి సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
