BREAKING కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

  • బీదర్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం
  • ఎదురెదురుగా ఢీకొన్న కారు, డీటీడీసీ వాహనం
  • ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
  • గానుగాపూర్‌ ఆలయ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన

Accident: కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ల వద్ద దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. వెళ్తున్న వ్యాను, కారు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40)గా గుర్తించారు. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి కారులో స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఢీకొన్న దెబ్బకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Richest Dist: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

BREAKING కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి