Crime: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులోని హనుమాన్ సర్కిల్ వద్ద ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడులు పెద్ద సంచలనంగా మారాయి. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, వారి వద్ద నుంచి నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు ఉపయోగించిన బైక్‌ను సీజ్ చేశారు.
మొదట ఇది సాధారణ కేసుగా భావించిన ఎక్సైజ్ పోలీసులు, అరెస్టు అనంతరం విచారణ జరిపితే ఆశ్చర్యానికి గురయ్యారు. పట్టుబడ్డ వారిలో ఒకరు పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన మోహన్ సుందర్, అతను గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామంలోని దేవాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. మరో నిందితుడు గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీవాసి సాయికుమార్ అని గుర్తించారు.
పోలీసులు పక్కా సమాచారంతో ముందుగానే రెక్కీ నిర్వహించి, దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. విచారణలో మోహన్ సుందర్ గుడిలో పూజారిగా ఉంటూనే గంజాయి అమ్మకం ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్టు తేలింది. భక్తుల దక్షిణలు సరిపోక అక్రమ మార్గంలోకి అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు.
ఎక్సైజ్ అధికారుల ప్రకారం, ఈ ఇద్దరూ గంజాయిని ఎక్కడి నుండి తెస్తున్నారు, ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎంతకాలంగా ఈ వ్యాపారం చేస్తున్నారు అన్న విషయాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని. పవిత్రమైన పూజారి వృత్తిలో ఉండి ఇలాంటి నేరానికి పాల్పడటం స్థానికులను తీవ్రంగా షాక్‌కు గురిచేసిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
