Panchyat Elections: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కొత్త సర్పంచులు ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఎంపికైన సర్పంచులు ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ గెజిట్ విడుదల చేసింది.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,700 గ్రామపంచాయతీల్లో అదే రోజు నుంచి కొత్త పాలకవర్గాలు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాయి. కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామాల అభివృద్ధికి అవసరమైన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం.
