IVF Center : గాంధీ ఆసుపత్రిలో వారం రోజుల్లో ఐవిఎఫ్ సెంటర్‌ను ప్రారంభిస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రకటించారు. ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి పడకలు, నర్సింగ్ సిబ్బంది, విధుల్లో ఉన్న వైద్యులు, డయాగ్నోస్టిక్, క్లినికల్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకుని రోగుల యోగక్షేమాలు తెలుసుకున్నారు.
రోగులు నేలపై కూర్చొని ఉండడాన్ని గమనించిన ఆయన సరైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యుల వసతి గృహానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నామని, ఇప్పటికే రూ.78 కోట్లు నిధులు మంజూరయ్యాయని నరసింహులు తెలిపారు. కింగ్ కోటి ఆసుపత్రిలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మందిరాన్ని మంత్రి పరిశీలించారు.
మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులందరూ నాకు అక్కాచెల్లెళ్లలాంటి వారే. దళితులు, గిరిజనులు, అట్టడుగు వర్గాలకు చెందిన పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాసుపత్రులకు వస్తుంటారు.