Drugs: గచ్చిబౌలిలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. కర్ణాటక నుంచి డ్రగ్స్‌ను తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులు దాడులు నిర్వహించారు.
దాడుల సమయంలో ఎండీఎంఏ, గంజాయి సహా పలు రకాల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ఐదుగురు డ్రగ్స్ సరఫరాదారులు కాగా, మిగిలిన ఆరుగురు వినియోగదారులు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
