పోలీసులకు బహిరంగ సవాల్ విసిరిన రవి
ఐబొమ్మ (ప్రస్తుతం బప్పమ్ TV)లో తెలుగు సినిమాలు, ఓటిటి కంటెంట్ పైరసీగా పెట్టడంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రవి రెచ్చిపోతూ, “దమ్ముంటే పట్టుకోండి” అని పోలీసులకు, నిర్మాతలకు సవాల్ విసిరాడు. తన వెబ్‌సైట్‌పై దృష్టి పెడితే వారి వ్యక్తిగత వివరాలు బయట పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. సినీ ప్రముఖులు, పోలీసుల డేటా కూడా తన వద్ద ఉందని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో ఈ కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు.
సీపీ సీవీ ఆనంద్ కట్టుదిట్టమైన చర్యలు
సినీ ప్రముఖుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, పైరసీ గ్యాంగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇప్పటికే ఒక ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, ఐబొమ్మ నిర్వాహకుడిని కూడా పట్టుకుంటామంటూ స్పష్టం చేశారు. దీనిపై రవి మరోసారి పోలీసులకు సవాల్ విసిరినా, అతను హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
“హైదరాబాద్ పోలీసులు మజాకా కాదు” అని ఈ చర్య నిరూపించింది.
రవి అరెస్టు – కీలక విషయాల వెల్లడి
రవి తన భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. కరేబియన్ నుంచి పెద్ద నెట్‌వర్క్ సాగిస్తూ అక్కడే సర్వర్లు మేనేజ్ చేస్తున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేయడం కష్టమైపోయినా, స్వదేశానికి వచ్చినప్పుడు పోలీసుల బారిన పడ్డాడు. విచారణలో తాజా సినిమాల ప్రింట్లు, డేటా సహా పలు సాక్ష్యాలు బయటపడ్డాయి.
-
రవి ఖాతాలో ఉన్న రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు
-
సర్వర్లకు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్‌ను పోలీసులు చెక్ చేశారు
-
నేటి లోపల రవిని కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది
Also Read: Dowry: చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా.. తప్పని వరకట్న వేధింపులు
iBomma: ‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నోడిని పట్టుకున్నారు: సీవీ ఆనంద్
