CV Anand: బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్

CV Anand apologizes to Balayya

CV Anand apologizes to Balayya

CV Anand: సెప్టెంబర్‌లో సీవీ ఆనంద్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో సిటీ పోలీసులు భారీ సినిమా పైరసీ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఆ తరువాత ఆయన టాలీవుడ్ ప్రముఖులతో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు బాలయ్య‌ను తప్పించి ఇతర అగ్రహీరోలు అందరూ హాజరయ్యారు. పైరసీని అరికట్టే మార్గాలు, సినిమా పరిశ్రమ–పోలీసుల మధ్య సమన్వయం ఎలా పెంచుకోవాలన్నదిపై విపులంగా చర్చ జరిగింది.

ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను సీవీ ఆనంద్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అదే సమయంలో ఓ నెటిజన్ “బాలయ్యను కూడా మీటింగ్‌కు పిలవండి, లేకపోతే ఆయన అసెంబ్లీలో ప్రశ్నిస్తాడు” అంటూ కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్‌కి సీవీ ఆనంద్ ఖాతా నుంచి స్మైలీ ఎమోజీ వచ్చింది. ఇదే బాలయ్య అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది. టాలీవుడ్ పిల్లర్, మూడు సార్లు ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అయిన బాలకృష్ణ గురించి ఇలా స్పందించడం ఏమిటని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ వివాదం రెండు నెలలుగా సాగుతూనే ఉంది.

తాజాగా దీనిపై సీవీ ఆనంద్ స్పష్టత ఇచ్చారు. ఆ ఎమోజీ తాను పెట్టలేదని, తన సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించే వ్యక్తి తెలియకపోయి అలా చేసిన పని అని చెప్పారు. అది తనకు వెంటనే తెలిసి ఉంటే అభ్యంతరం వ్యక్తం చేసేవాడిని, తెలిసిన వెంటనే పోస్ట్‌ని డిలీట్ చేసి, విషయాన్ని పూర్తిగా విచారించానని పేర్కొన్నారు. బాలకృష్ణతో తనకు ఎంతోకాలంగా వ్యక్తిగత సంబంధం ఉందని, ఆయనకు స్వయంగా పర్సనల్ మెసేజ్ ద్వారా క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు.
అగ్ర నటులందరిపైనా తనకున్న గౌరవం మారదంటూ, ఆ రిప్లై ఇచ్చిన సోషల్ మీడియా హ్యాండ్లర్‌ను తొలగించినట్లు కూడా వెల్లడించారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.

Also Read: Warm Water: తిన్న వెంటనే వేడి నీళ్లు తాగితే..

CV Anand: బాలయ్యకు సారీ చెప్పిన సీవీ ఆనంద్