Jublee Hills By-polls: కేటీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

Complaint to EC for file criminal case against KTR

Complaint to EC for file criminal case against KTR

  • మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు..
  • మైనర్లను ఎన్నికల ప్రచారంలో ఉపయోగిస్తున్నారని..
  • కేటీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరిన షఫీవుద్దీన్‌ అనే ఓటరు..
  • ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారాలు చేస్తున్న కేటీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

Jublee Hills By-polls: మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓ ఫిర్యాదు చేరింది. మైనర్ పిల్లలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటట్లు చేస్తున్నారని, దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని షఫీఊద్దీన్ అనే ఓటరు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రచారం చేస్తున్న కేటీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయ‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇటీవ‌ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదంగా మారాయి. ‘ఓటుకు రూ.5 వేల రూపాయలు తీసుకుని, భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఓటేయండి’ అని చెప్పడం ప్రజాస్వామ్య నియమాల‌కు విరుద్ధమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్వయంగా సుమోటో కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

ఇదే సమయంలో, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాన్గ్రెస్ నేతలు పెద్ద కుట్ర పన్నుతున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.

Also Read: Telangana: రెండేళ్ల కుమార్తెతో సహా హుస్సేన్ సాగర్ లో దూకి మహిళ ఆత్మహత్య

Jublee Hills By-polls: కేటీఆర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు