Bride: తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం ఓ విచిత్ర సంఘటన జరిగింది. దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన పాలి సత్యనారాయణ, గోపాలపురం మండలం భీమోలు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి చేసుకోవాల్సి ఉంది.
తెల్లవారుజామున ముహూర్తం ఉండగా, ఆదివారం సాయంత్రం వరుడు కనిపించకపోవడంతో వధువు బంధువులు ఆందోళనకు గురయ్యారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్లో విచారణలో, సత్యనారాయణ ఐదేళ్ల క్రితమే భర్త చనిపోయిన ఓ మహిళను వివాహం చేసుకున్న విషయం బయటపడింది. ఆమె కుమార్తెకు కూడా అతడే పెళ్లి జరిపించాడట.
ఆదివారం ఆ మహిళ ఫోన్ చేసి కేసు వేస్తానని హెచ్చరించడంతో, సత్యనారాయణ ఆమెతో కలిసి పరారైనట్లు వధువు తరఫువారు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, వధువుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సీఐ బి. నాగేశ్వర నాయక్ చెప్పారు.
