ibomma: ‘ఐ బొమ్మ’ రవికి మరోసారి బిగ్ షాక్

Another big shock for 'iBomma' Ravi

Another big shock for 'iBomma' Ravi

ibomma: ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇమ్మడి రవి ఇటీవల నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్లపై బుధవారం నాడు కోర్టు విచారణ నిర్వహించింది. విచారణ సందర్భంగా రవి, తాను హైదరాబాద్‌ను వదిలి వెళ్లనని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని న్యాయస్థానానికి తెలియజేశాడు. ఇకపై పైరసీకి పాల్పడనని కూడా కోర్టును వేడుకున్నాడు.

అయితే పోలీసులు కోర్టులో వేరే వాదన వినిపించారు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని, అలాగే ఇమ్మడి రవికి పలు దేశాల్లో పౌరసత్వం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇరువైపుల వాదనలు పరిశీలించిన న్యాయస్థానం, ఐబొమ్మ రవి దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. నమోదుైన ఐదు కేసులలోనూ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి, అతని బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

Also Read: Hydrogen Train: దేశంలోనే తొలి ‘హైడ్రోజన్ ట్రైన్’ సిద్ధం

ibomma: ‘ఐ బొమ్మ’ రవికి మరోసారి బిగ్ షాక్