Zomato: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జొమాటో డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. డెలివరీ బాయ్‌ని నరేష్‌గా గుర్తించారు. ఆగస్టు 31 రాత్రి మాదాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. 10 రోజులు గడిచినప్పటికీ, ఈ కేసులో అతని కుటుంబానికి ఎలాంటి పరిహారం అందకపోవడం గమనార్హం.
పరిహారం చెల్లించాలని యూనియన్ డిమాండ్ .
భారతీయ మల్టీ నేషనల్ రెస్టారెంట్ అగ్రిగేటర్ ఫుడ్ డెలివరీ కంపెనీ అయిన జోమాటో మృతుడి కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబానికి వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ కింద జొమాటో పరిహారం అందించాలని ఆయన కోరారు.
సమ్మెకు దిగుతామని హెచ్చరిక
కాగా, మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందజేసేందుకు సరైన పత్రాలు సమర్పించాలని కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ కోరారు. డ్యూటీలో ఉండగా గిగ్ వర్కర్ ప్రాణాలు కోల్పోవడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు, బంజారాహిల్స్‌లోని ఒక అపార్ట్‌మెంట్ మూడవ అంతస్తు నుండి దూకి, కస్టమర్ పెంపుడు కుక్క నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన స్విగ్గీ డెలివరీ బాయ్ గాయాలతో మరణించాడు.
ఆ సందర్భంలో, యూనియన్ ప్రాతినిధ్యం వహించిన తరువాత, ప్రభుత్వం రూ. 2 లక్షలు పరిహారంగా అందించిందని షేక్ సలావుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో డెలివరీ బాయ్ మృతి చెందడంపై జోమాటో ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.