Black Magic : కామారెడ్డి మండలం అడ్లూర్ గ్రామంలో 46 ఏళ్ల వ్యక్తి చేతబడి చేశాడని స్థానికులు దాడి చేశారు. గ్రామస్థులు సాయిలును చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టి, రాళ్లు రువ్వి, కారంపొడి చల్లారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని దేవునిపల్లి పోలీసులు రక్షించి తలకు, కాళ్లకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
దాడి చేసిన వారిపై సాయిలు కుటుంబ సభ్యులు స్థానిక గొడుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.