Telangana: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నారాయణపేట పట్టణంలో జెండా పెట్టే విషయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సెప్టెంబర్ 18న ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం పాతబస్టాండ్ జంక్షన్‌లో కొందరు ముస్లిం యువకులు జెండాను ఏర్పాటు చేయడంతో గొడవ మొదలైంది. వేరే వర్గానికి చెందిన కొందరు జెండాను తొలగించి రోడ్డుపై పడేశారు.
దీనిపై వాగ్వాదం జరగడంతో ఇరు వర్గాలకు చెందిన వారు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. సమస్యాత్మక ప్రదేశానికి బలగాలను తరలించారు.
హైదరాబాద్ నుంచి పోలీసు శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. గణేష్ నిమర్జనాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ముస్లిం సంఘాలు ర్యాలీలను వాయిదా వేసి ఈ రోజుకు షెడ్యూల్ చేశాయి.