Road Accident : సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం గణేష్‌పూర్ వద్ద జహీరాబాద్-బీదర్ రహదారిపై కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు కుటుంబసభ్యులు దుర్మరణం చెందారు. మృతులను గునెల్లి సిద్దం (59), ఆయన కుమార్తె బిరాదార్ రేణుక (35), ఆమె భర్త బిరాదార్ జగన్నాధం (41), వారి కుమారుడు వినయ్ కుమార్ (12)గా గుర్తించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై హద్దనూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.