Farmers’ March : తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ప్రతిపాదిత ఫార్మా విలేజ్‌కు నిరసనగా రైతులు చేపట్టిన మహా పాదయాత్రను పోలీసులు విఫలం చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలేపల్లి నుంచి దుద్యాల మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్‌వో) కార్యాలయం వరకు మహా పాదయాత్రకు రైతులు పిలుపునిచ్చారు.
ఫార్మా కంపెనీల క్లస్టర్‌గా ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిన దుద్యాల మండలం హకీంపేట సమీపంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.
బీఆర్‌ఎస్ నేతల అరెస్ట్
రైతుల మహా పాదయాత్రకు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మద్దతు ప్రకటించింది. నిరసనలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో సహా పలువురు నిరసనకారులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
హకీంపేటలో రైతులు గత 27 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఫార్మా విలేజ్ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రైతుల నిరసనను అడ్డుకునేందుకు హకీంపేట కూడలి వద్ద పోలీసు బలగాలను మోహరించారు.