Farmhouse : రంగారెడ్డి జిల్లా కొత్తగూడ ప్రాంతంలో అక్టోబర్ 14వ తేదీ మంగళవారంనాడు ఫామ్‌హౌస్‌లో కేర్ టేకర్లుగా ఉన్న వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. మృతులు తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య, శాంతమ్మగా గుర్తించారు.
వీరికి ఫామ్ హౌస్ భద్రత, నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దంపతులపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటనపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి.. దోపిడీ ప్రయత్నాల్లో భాగమే హత్యా లేక దంపతులకు తెలిసిన వారే హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.