Dasara Holidays: సెలవులకు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ జారీచేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం, సెలవులు 13 రోజులు ప్రకటించారు
హైదరాబాద్‌లోని పాఠశాలలకు అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ఇచ్చారు. ఇవి అక్టోబర్ 2 నుంచి సెలవులు ప్రారంభం కాగా, అక్టోబర్ 15న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయి.
సెలవుల తర్వాత అక్టోబర్ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ ఎస్ఏ వన్ జరుగుతుంది. ఈ సంవత్సరం ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఎస్సే టు సమ్మెటివ్ అసెస్‌మెంట్ ఏప్రిల్ 9 నుంచి 19 వరకు పరీక్షలు జరుగుతాయి.
అలాగే పదవ తరగతి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28కి ముందు బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ,మార్చి 2025నెలలో ఉంటాయి.
ప్రభుత్వం సెలవులు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12, 13న విజయదశమి సెలవులు కాగానే దానికి ముందు వచ్చే దుర్గాష్టమి మహర్నవమి, సందర్భంగా అక్టోబర్ 10, 11న కూడా సెలవు ప్రకటించారు.