Telangana

School Holidays: ఈ నెల 26, 27తేదీల్లో స్కూళ్లకు సెలవులు

School Holidays

School Holidays

School Holidays: తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఫిబ్రవరి నెలలో ఆదివారాలు కాకుండా అదనంగా మరో రెండు రోజులపాటు వరుసగా సెలవులు రానున్నాయి. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి నెలలో కేవలం ఆదివారాలు తప్ప మరే సెలవులు లేవు. ఈ నెలలో నాలుగు ఆదివారాలతో పాటు శివరాత్రి పండగ సెలవు మాత్రమే ఉంది. ఈ 5 రోజులు కాకుండా ఫిబ్రవరి నెల సెలవుల జాబితాలో మరో సెలవు కూడా చేరే అవకాశం కనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలే అందుకు కారణం. ఈ ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాలోని స్కూళ్లకు పోలింగ్ రోజున ఫిబ్రవరి 27న సెలవు రానుంది.

గతంలో టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున సెలవు ప్రకటించిన సర్కార్.. ఈసారి కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి పండగ వస్తుంది. ఆ రోజు పబ్లిక్‌ హాలిడే కాబట్టి సెలవు వస్తుంది. దీంతో ఫిబ్రవరి 26, 27 రెండ్రోజులు సెలవులు రానున్నాయి.

Also Read : Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలో మలయాళీ స్టార్ హీరో

School Holidays: ఈ నెల 26, 27తేదీల్లో స్కూళ్లకు సెలవులు