Telangana

Bhadradri Temple : భద్రాద్రి ఆలయ పూజారి సస్పెండ్

Bhadradri temple priest suspended after sexual abuse FIR

Image Source : The Siasat Daily

Bhadradri Temple : భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో జరిగిన కీలక పరిణామంలో ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడింది.

పూజారి తన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ సమాచారాన్ని ఆలయ అధికారులకు దాచిపెట్టారంటూ చార్యులుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తన మామగారు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, అత్త, ఇతర కుటుంబ సభ్యులు తనను రూ.10 లక్షల కోసం వేధించారని కోడలు ఆగస్టు 14న ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణలపై భద్రాద్రి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎల్ రమాదేవి స్పందిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు చార్యులు, ఆయన దత్తపుత్రుడు తిరుమల వెంకట సీతారాం ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : Overage Vehicles : ఓవరేజ్ వెహికిల్స్ పై త్వరలో నిషేధం

Bhadradri Temple : భద్రాద్రి ఆలయ పూజారి సస్పెండ్