Flipkart: ఈ టీవీ ధర అక్షరాలా రూ.1 కోటి

TCL 115"X955 Premium QD-Mini LED TV

TCL 115"X955 Premium QD-Mini LED TV

Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో టీవీలు, మొబైల్స్ పై ఆఫర్లు అందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సేల్ లో ఒక టీవీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అది టీసీఎల్ 115 ఇంచెస్ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ. దీని అసలు ధర రూ. 1 కోటి ఉంటే, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో రూ. 20 లక్షలకు లభిస్తుంది. అదనంగా కూపన్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ కలుపుకుంటే ఈ టీవీ ధర కేవలం రూ. 16 లక్షలుకి పడుతుంది. అంటే సుమారు రూ. 84 లక్షల తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఈ టీవీని కొనుగోలు చేసే కొందరికి క్రికెటర్ రోహిత్ శర్మ ను కలిసే అవకాశం కూడా ఉందని వార్తలు ఉన్నాయి.

టీవీ ఫీచర్స్

టీసీఎల్ 115 ఇంచెస్ గూగుల్ టీవీ భారతదేశంలో ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద టీవీలలో ఒకటి. ఇది క్వాంటం ఎల్‌ఈడీ టెక్నాలజీతో పనిచేస్తుంది. 5000 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్, 50 మిలియన్ : 1 కాంట్రాస్ట్ రేషియో తో ఇమేజ్ క్వాలిటీ అత్యుత్తమంగా ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.2.2 హై-ఫై సౌండ్ సిస్టమ్, 12 స్పీకర్లు మరియు 240 వాట్స్ పీక్ ఆడియోని అందిస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది.

గేమింగ్ & ఆపరేటింగ్ సిస్టమ్

ఈ టీవీలో గేమింగ్ కోసం ప్రత్యేక టీసీఎల్ గేమ్ మాస్టర్ టెక్నాలజీ ఉంది. ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్ వంటి ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఉంటాయి. అదనంగా గూగుల్ మీట్, గూగుల్ కిడ్స్, మల్టీవ్యూ వంటి ఫీచర్లు కూడా పొందుపరచబడ్డాయి.

డిజైన్ & థియేటర్ ఎక్స్‌పీరియెన్స్

టీవీ డిజైన్ స్లిమ్‌గా ఉండగా, 16-బిట్ లైటింగ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. కనెక్టివిటీ కోసం 4 హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్స్, 3 యూఎస్‌బీ పోర్ట్స్, బ్లూటూత్, వైఫై సపోర్ట్ అందిస్తుంది. బరువు సుమారు 100 కిలోలు ఉంటుంది. ఇంట్లో థియేటర్ లాంటి అనుభూతి కోరుకునేవారికి ఈ టీవీ అద్భుతమైన ఎంపిక.

Also Read: Bank Jobs: 13,217 బ్యాంక్ ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

Flipkart: ఈ టీవీ ధర అక్షరాలా రూ.1 కోటి