Whatsapp: అక్కడ వాట్సాప్ బ్యాన్

Russia moves to block WhatsApp in messaging app crackdown

Russia moves to block WhatsApp in messaging app crackdown

Whatsapp: రష్యా–అమెరికన్ కంపెనీల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా ప్రభుత్వం వాట్సాప్ సేవలపై కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా చట్టాలు, నిబంధనలు పాటిస్తే వాట్సాప్‌కు ఎలాంటి సమస్య ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అయితే తమ సేవలను పూర్తిగా నిషేధించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తోందని వాట్సాప్ (మెటా) వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు కూడా ధృవీకరించారు. వినియోగదారులను పరస్పరం కలుపుతూ సేవలు కొనసాగించేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని వారు పేర్కొన్నారు.

ఇప్పటికే రష్యాలో వాట్సాప్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు పరిమితమయ్యాయి. తాజాగా వాట్సాప్ సేవలను పూర్తిగా బ్లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రష్యా కమ్యూనికేషన్ వాచ్‌డాగ్ అయిన రోస్కోమ్నాడ్జోర్, తన ఆన్‌లైన్ డైరెక్టరీ నుంచి వాట్సాప్ పేరును తొలగించినట్లు నివేదికలు వెలువడ్డాయి. రష్యాలో దాదాపు 10 లక్షల మంది వినియోగదారులు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నట్లు అంచనా.

ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తరువాత నుంచి రష్యా అమెరికాకు చెందిన టెక్ కంపెనీలపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ‘MAX’ అనే యాప్‌ను ఎక్కువ మంది పౌరులు ఉపయోగించాలని రష్యా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే ఈ యాప్ ద్వారా పౌరుల కదలికలు, కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

గత ఏడాది రష్యా వాట్సాప్, టెలిగ్రామ్ కాలింగ్ సేవలను నిషేధించింది. మోసాలు, ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని ఈ ప్లాట్‌ఫామ్‌లు చట్ట అమలు సంస్థలతో పంచుకోవడం లేదని రష్యా ఆరోపించింది. అంతేకాకుండా, డిసెంబర్ నెలలో ఆపిల్ ఫేస్‌టైమ్, స్నాప్‌చాట్ వంటి యాప్‌లను కూడా నిషేధించింది. మోసాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రణాళిక చేయడం, అమలు చేయడం కోసం ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారని రష్యా ప్రభుత్వం తెలిపింది.

మెటా రష్యన్ చట్టాలను పూర్తిగా పాటిస్తే వాట్సాప్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడాన్ని పరిశీలించవచ్చని రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో ప్రశ్నించగా క్రెమ్లిన్ ప్రతినిధి స్పందిస్తూ, ఇది పూర్తిగా చట్ట అమలుకు సంబంధించిన అంశమని అన్నారు. మెటా రష్యన్ అధికారులతో సంభాషణ ప్రారంభించి, చట్టాలను గౌరవిస్తే రాజీకి అవకాశం ఉందన్నారు. అయితే, రష్యన్ నిబంధనలను పాటించేందుకు మెటా సిద్ధంగా లేకపోతే, వాట్సాప్‌పై నిషేధం ఎత్తివేసే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

Also Read: T20 World Cup 2026: ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ ఘన విజయం

Whatsapp: అక్కడ వాట్సాప్ బ్యాన్