Suryakumar Yadav : సెప్టెంబర్ 14 సూర్యకుమార్ యాదవ్‌కు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు. అయిచే అతని నికర విలువను తెలుసుకోవాలని అతని అభిమానులు చాలా మంది కోరుకుంటూ ఉంటారు. సూర్యకుమార్ యాదవ్ ఆస్తుల విలువ కోట్లలో ఉంది. అతను ఎక్కడ నుండి అంత సంపాదిస్తున్నాడు. అతని ఆదాయ వనరులు ఏమిటి, బీసీసీఐ అతనికి ప్రతి సంవత్సరం ఎంత డబ్బు ఇస్తుందో ఈ రోజు మనం తెలుసుకుందాం.
అతను BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్ B ఆటగాడు. దీని కింద వారికి ఏటా రూ.3 కోట్లు అందజేస్తారు. ఇటీవల టీ20 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. సూర్యకుమార్ యాదవ్ నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు. బీసీసీఐ అతనికి ప్రతి వన్డేకు రూ.6 లక్షలు, ప్రతి టీ20కి రూ.3 లక్షలు, టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు ఇస్తుంది.
క్రికెట్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్నాడు. సూర్య చాలా బ్రాండ్‌లకు ప్రకటనలు చేయడం మీరు చూసే ఉంటారు. ఇందుకోసం సూర్య కోటి రూపాయలు తీసుకుంటాడు. డ్రీమ్ 11, రీబాక్, జియో సినిమా వంటి కంపెనీలకు సూర్య ప్రకటనలు ఇస్తున్నాడు. ఐపీఎల్ నుంచి ఒక్కో సీజన్‌కు రూ.8 కోట్లు సంపాదిస్తున్నాడు. ముంబై ఇండియన్స్‌కు ఆడే కాంట్రాక్ట్ కింద సూర్యకి రూ.8 కోట్లు లభించాయి.
సూర్య ముంబైలోని కోట్ల విలువైన ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఇక్కడ నుండి అద్భుతమైన దృశ్యం చూడవచ్చు. అతని కార్ల కలెక్షన్ గురించి చెప్పాలంటే, ఇందులో చాలా లగ్జరీ వాహనాలు ఉన్నాయి. సూర్య కార్లలో ఆడి RS 5, పోర్షే 911 టర్బో S, మెర్సిడెస్-బెంజ్ ఆడి RS 5, ఫార్చ్యూనర్, BMW 5 సిరీస్ M స్పోర్ట్స్ ఉన్నాయి. అతని వద్ద హయబుసా బైక్ కూడా ఉంది.