Smriti Mandhana: స్మృతి మందాన పెళ్లికి డేట్ ఫిక్స్‌

Palash Muchhal Receives Warm Welcome At Smriti Mandhana's House Ahead Of Wedding On November 23

Palash Muchhal Receives Warm Welcome At Smriti Mandhana's House Ahead Of Wedding On November 23

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి అధికారికంగా వెల్లడించారు. గురువారం ఆమె ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా ఈ విషయాన్ని కన్‌ఫామ్ చేశారు. జెమీమా రోడ్రిగ్స్, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి పాల్గొన్న వీడియోలో స్మృతి తన ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపిస్తూ త్వరలో పెళ్లి ఉండబోతోందని తెలిపింది. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆమె ప్రేమలో ఉన్న విషయం ఎప్పటినుంచో తెలిసిందే. వీరిద్దరూ నవంబర్ 23న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

ప్రధాని మోదీ శుభాకాంక్షలు
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక లేఖ ద్వారా ఈ జంటకు అభినందనలు తెలిపారు. ఇద్దరూ జీవితంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలని, వారి జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. పెళ్లి కూతురు vs పెళ్లి కొడుకు జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ సెలబ్రేషన్ ఘనంగా జరగాలని ఆశించారు. తన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని మోదీ పేర్కొన్నారు.

ఇక గత కొద్దిరోజులుగా స్మృతి–పలాష్ రిలేషన్‌పై ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పలాష్ “త్వరలో స్మృతి ‘ఇండోర్ కోడలు’ అవుతుంది” అని చెప్పడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. నవంబర్ 23న జరగబోయే ఈ పెళ్లికి పలు ప్రముఖ క్రికెటర్లు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు.

క్రికెట్ కెరీర్‌లో దూసుకెళ్తున్న స్మృతి
ఇటీవల జరిగిన ICC మహిళల వన్డే వరల్డ్ కప్‌లో స్మృతి మంధన అద్భుత ప్రదర్శనతో భారత్‌కు కీలక విజయాలు అందించారు. న్యూజిలాండ్‌పై చేసిన మ్యాచ్ విన్నింగ్ సెంచరీ ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 54.22 సగటుతో 434 పరుగులు చేశారు.

స్మృతి మంధన–పలాష్ ముచ్చల్ పెళ్లి వార్త బయటకొచ్చిన తర్వాత అభిమానులు, క్రికెట్ ప్రేమికులు భారీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి కొత్త జీవితం ప్రేమతో, సంతోషంతో నిండిపోయాలని అందరూ కోరుతున్నారు.

Also Read: Pregnancy: పిల్లలు కనేందుకు సరైన సమయమిదే..!

Smriti Mandhana: స్మృతి మందాన పెళ్లికి డేట్ ఫిక్స్‌