Hug Day: 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే ఇన్ని లాభాలా..?

What 20 Seconds of Hugging Can Do for You

What 20 Seconds of Hugging Can Do for You

Hug Day: మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ హిట్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ దాదాపు అందరూ చూసే ఉంటారు. చిరంజీవి కెరీర్‌లోనే ఈ సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది. కామెడీతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందని అనుకుంటున్నారా? అందుకు కారణం ఇందులోని ఓ ప్రత్యేకమైన సన్నివేశం, డైలాగ్.

ఈ సినిమాలో చిరు చెప్పే ‘జంతర్ మంతర్ చూ మంతర్ ఖాళీ’ అనే డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఎదుటివారిని హగ్ చేసుకోవడం ద్వారా వారి కోపం, ఆవేశాన్ని తగ్గించవచ్చని, మనపై ప్రేమను పెంచుకోవచ్చని ఈ సినిమాలో చూపిస్తారు. అప్పట్లో సినిమాటిక్‌గా అనిపించిన ఈ ఆలోచన ఇప్పుడు శాస్త్రీయంగా కూడా నిజమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నిపుణుల మాటల ప్రకారం, మనల్ని ప్రేమించే వారిని ప్రతిరోజూ కనీసం 20 సెకన్ల పాటు హగ్ చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముందుగా, హగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనినే ప్రేమ హార్మోన్ లేదా కడిల్ హార్మోన్ అంటారు. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది.

అలాగే, కౌగిలింత వల్ల సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, జీవిత భాగస్వామి ఎవరివైనా సరే, శారీరక స్పర్శ భావోద్వేగ బంధాన్ని గాఢంగా చేస్తుంది. ప్రేమ, అప్యాయత పెరుగుతాయి. క్రమం తప్పకుండా హగ్ చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇంతేకాదు, హగ్ చేసుకోవడం మనసును ఆనందంగా ఉంచుతుంది. హ్యాపీ హార్మోన్లు విడుదలై మానసిక స్థితి మెరుగుపడుతుంది. కోపం తగ్గి, పరస్పర కమ్యూనికేషన్ బలపడుతుంది. గుండె ఆరోగ్యానికీ ఇది మేలు చేస్తుంది. కాబట్టి, చిరు సినిమాలో చెప్పినట్టు… ఒక చిన్న హగ్ మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదన్న మాట!

Also Read: Muncipal Polls: ఓడిపోతానన్న భయంతో కుక్కర్లు పంచాడు

Hug Day: 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే ఇన్ని లాభాలా..?