Maha Shivaratri: మహాశివరాత్రి ఏ రోజున జరుపుకోవాలి?

Mahashivratri 2026: Date, Significance & Puja Timings

Mahashivratri 2026: Date, Significance & Puja Timings

Maha Shivaratri: మహాశివరాత్రి హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ప్రతీ సంవత్సరం మాఘ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున ఈ పర్వదినం వస్తుంది. సాధారణంగా మన సంప్రదాయంలో హిందూ పండుగలు ఉదయం తిథి ఉండే కాలాన్ని ఆధారంగా తీసుకొని జరుపుకుంటారు. అయితే మహాశివరాత్రి విషయంలో మాత్రం ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ పండుగలో రాత్రి తిథి ఉండటం అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం. అందువల్ల రాత్రి సమయంలో చతుర్దశి ఉన్న రోజునే మహాశివరాత్రి నిర్వహించడం శాస్త్రోక్తంగా భావిస్తారు.

ఈ ఏడాది మహాశివరాత్రి చతుర్దశి తిథి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4.47 గంటలకు మొదలై, తదుపరి రోజు అయిన ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 5.32 గంటలకు ముగియనున్నది. ఈ కాలంలో అర్ధరాత్రి సమయం 15వ తేదీ రాత్రికే వస్తుంది కాబట్టి, ఆ రోజు మహాశివరాత్రి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.

శివభక్తులు ఈ రోజు ఉపవాసాలు ఉండి, రాత్రి జగరణం చేస్తూ శివపూజలు, అభిషేకాలు, రుద్రాంలు, మహోన్నతమైన శివస్తోత్రాలు, మహాన్యాసాలు, లింగార్చన వంటి కార్యక్రమాలతో భక్తిని చాటుకుంటారు. శివరాత్రి నాడు ఉపవాసం చేసి, చతుర్దశి సమయంలో రాత్రి అభిషేకం చేస్తే శివ అనుగ్రహం, శాంతి మరియు శ్రేయస్సు లభిస్తాయని ధర్మశాస్త్రం చెబుతోంది. అందువల్ల ఈ సంవత్సరం శివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి జరుపుకోవడం శాస్త్రసమ్మతమని పండితుల అభిప్రాయం.

Also Read: Viral: 70 ఏళ్ల వయసులో తొలి వ్లాగ్.. 3 కోట్ల వ్యూస్

Maha Shivaratri: మహాశివరాత్రి ఏ రోజున జరుపుకోవాలి?