H1 B Visa: వీసా అంటే ఏంటీ.. ఎంత ఖర్చవుతుందంటే..

H1 B Visa: What is a visa? How much does it cost?

H1 B Visa: What is a visa? How much does it cost?

H1 B Visa: అమెరికా మన దేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఆ దేశం గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కారణం ఏమిటంటే – లక్షలాది భారతీయులు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.

అందులోనూ ఐటీ ఉద్యోగులు, హెచ్-1బీ వీసాల గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటుంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్ అయింది. తాజాగా కూడా హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు ఈ వీసాలు ఏమిటో తెలుసుకుందాం.

వీసా అంటే ఏమిటి?

ఒక దేశ పౌరుడు మరో దేశానికి వెళ్లాలంటే అనుమతి పత్రం కావాలి. ఆ అనుమతి పత్రాన్నే వీసా అంటారు. పర్యాటకులు, వ్యాపారులు, ఉద్యోగులు, కళాకారులు, క్రీడాకారులు ఇలా వేర్వేరు అవసరాలకు వేర్వేరు రకాల వీసాలు ఉంటాయి.

హెచ్-1బీ వీసా

అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేసేందుకు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న విదేశీయులకు ఇచ్చే అనుమతి పత్రం హెచ్-1బీ వీసా. ఇది నాన్-ఇమిగ్రేషన్ వీసా కేటగిరీలోకి వస్తుంది. అంటే అమెరికాలో శాశ్వతంగా ఉండటానికి కాకుండా, కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఈ వీసా వర్తిస్తుంది.

రకాలు

అమెరికా ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో హెచ్-1బీ వీసాలు జారీ చేస్తుంది. ఇవి మూడు విభాగాల్లో ఉంటాయి:

  • జనరల్ కోటా – 65,000 వీసాలు

  • మాస్టర్స్ కోటా – అమెరికాలో మాస్టర్స్ చేసిన వారికి 20,000 వీసాలు

  • రిజర్వ్‌డ్ కోటా – సింగపూర్, చిలీ దేశాలకు 6,800 వీసాలు

ఎంపిక విధానం

హెచ్-1బీ వీసాలకు డిమాండు చాలా ఎక్కువ. కోటాకు మించిన అప్లికేషన్లు వస్తే లాటరీ విధానంలో కంప్యూటర్ ర్యాండమ్‌గా ఎంపిక చేస్తుంది.

ఎవరు దరఖాస్తు చేయాలి?

సంస్థలు తమ ఉద్యోగుల కోసం హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేస్తాయి. కొన్ని కంపెనీలు స్పాన్సర్ కూడా చేస్తాయి.

ఫీజులు

సంస్థ పరిమాణాన్ని బట్టి దరఖాస్తు ఫీజు 1,600 డాలర్ల నుంచి 7,400 డాలర్ల వరకు ఉంటుంది (భారత రూపాయల్లో దాదాపు 1 లక్ష నుంచి 5 లక్షలు). 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీలు, అందులో సగం మందికి పైగా హెచ్-1బీ వీసాలు ఉంటే అదనంగా 4,000 డాలర్లు (రూ.2.60 లక్షలు) చెల్లించాలి.

కాల పరిమితి

హెచ్-1బీ వీసా ఒకసారి లభిస్తే మొదట మూడేళ్లపాటు అమెరికాలో ఉండవచ్చు. దీన్ని పొడిగించుకునే అవకాశం ఉంది కానీ మొత్తం కలిపి ఆరు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం ఉండటానికి వీలు లేదు.

హెచ్-4 డిపెండెంట్ వీసా

హెచ్-1బీ ఉద్యోగుల భార్య/భర్త, 21 ఏళ్ల లోపు పిల్లలు హెచ్-4 వీసా మీద అమెరికాలో ఉండవచ్చు. చదువు కొనసాగించవచ్చు కానీ ఉద్యోగం చేయాలంటే ప్రత్యేకంగా వర్క్ పర్మిట్ తీసుకోవాలి.

Also Read: Elections: తెలంగాణలో ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు లేనట్టే!!

H1 B Visa: వీసా అంటే ఏంటీ.. ఎంత ఖర్చవుతుందంటే..