Crime: తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా ఊరపాక్కాకు చెందిన ఓ మహిళ వ్యక్తిగత వీడియో కేసు వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఆమె తన భర్తతో గడిపిన ఏకాంత క్షణాలు ఉన్నాయి. ఈ వీడియోను పొందిన వ్యక్తి డబ్బులు ఇవ్వాలని, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు.
దీనిపై బాధితురాలు భర్తకు వివరాలు చెప్పడంతో, వారు కలిసి కిళాంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నిందితుడు పెరుంబాక్కం కన్నగినగర్‌కు చెందిన ప్రకాశ్ (28) అని గుర్తించారు. అతను పరారీలో ఉండటంతో గాలింపు జరిపి, అరియలూర్ జిల్లా ఉడైయారాళ్యంలో అతన్ని పట్టుకున్నారు.
ప్రాథమిక విచారణలో ప్రకాష్, భార్యాభర్తలు ఏకాంతంగా ఉన్నప్పుడు ఓ మహిళ ఆ వీడియో తీసి తనకు అందజేసిందని పోలీసులకు చెప్పాడు. అనంతరం నిందితుడిని తాంబరం కోర్టులో హాజరుపరచగా, రిమాండుకు తరలించారు
