Crime: నష్ట పరిహారం వస్తుందని.. భర్తను విషం పెట్టి చంపి.. పెంటకుప్పలో పడేసి..

Woman arrested for killing husband; cites wild animal attack to claim compensation

Woman arrested for killing husband; cites wild animal attack to claim compensation

Crime: మైసూరు జిల్లాలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. భర్త చనిపోతే ప్రభుత్వం నుంచి పింఛను, పరిహారం వస్తుందని ఆశించి భార్యనే అతనిని హత్య చేసిన ఘటన హుణసూరు తాలూకాలో జరిగింది.

చిక్క హెజ్జూరుకు చెందిన వెంకటస్వామి (54)ని అతని భార్య సల్లాపురి (48) విషాహారం పెట్టి చంపింది. అనంతరం మృతదేహాన్ని ఊరి శివార్లలోని అటవీ ప్రాంతం దగ్గర పెంటకుప్పలో పడేసింది.

తన భర్త కనిపించకపోవడంతో రెండు రోజుల క్రితం సల్లాపురి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. పొలానికి వెళ్లిన సమయంలో పులి లాక్కెళ్లి ఉండొచ్చని అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామస్థులతో కలిసి గాలింపు ప్రారంభించారు.

అయితే, శుక్రవారం ఉదయం పెంటకుప్పలో కుళ్లిన స్థితిలో వెంకటస్వామి మృతదేహం కనిపించడంతో కేసులో మలుపు తిరిగింది. శవం రంగు మారి ఉండటంతో అనుమానం పెరిగింది. సల్లాపురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆమె తానే భర్తకు విషాహారం ఇచ్చి హత్య చేసి, మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేశానని ఒప్పుకుంది.

పులి దాడిలో మరణిస్తే ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో పరిహారం వస్తుందని అనుకుని ఈ నేరానికి పాల్పడ్డానని చెప్పడంతో పోలీసులు షాక్‌కి గురయ్యారు.

Also Read: Karnataka: నిమజ్జన శోభాయాత్రలో ఘోర విషాదం.. 8 మంది మృతి

Crime: నష్ట పరిహారం వస్తుందని.. భర్తను విషం పెట్టి చంపి.. పెంటకుప్పలో పడేసి..