Ayyappa: హిందూ మత సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్పస్వామి దర్శనం ఎంతో పవిత్రంగా భావిస్తారు. కేరళలోని శబరిమలకు 18 కొండలు, 18 మెట్లు ఎక్కి ధర్మశాస్త్రుడైన అయ్యప్ప స్వామిని భక్తులు దర్శించుకుంటారు. ఈ యాత్రకు ముందు కార్తీక మాసం ప్రారంభంలోనే భక్తులు మాళను ధరించి 41 రోజులు మండల దీక్షను పాటిస్తారు.
ఈ దీక్షలో శరీరం, మనస్సు శుద్ధి కోసం అనేక నియమాలు పాటిస్తారు. కటిక నేలపై నిద్రించడం, చల్లని నీటితో స్నానం చేయడం, నల్లని దుస్తులు మాత్రమే ధరించడం, పాదరక్షలు లేకుండా నడవడం, రోజుకు ఒకసారే భోజనం చేయడం వంటి నియమాలు ఇందులో భాగం. ఈ సమయంలో రుద్రాక్ష, తులసి, స్పటికం, పగడాలు వంటి మాణిక్య మాలలు ధరించడం శారీరక, మానసిక శాంతిని కలిగిస్తుందనే విశ్వాసం ఉంది.
శని దోషం తగ్గుతుందనే నమ్మకం
పురాణాల ప్రకారం శని దేవుడు నల్లరంగునే ఎక్కువగా ఆమోదిస్తాడు. అయ్యప్ప దీక్షలో నల్లని బట్టలు ధరించడం, మాంసం, మద్యం వంటి వాటిని పూర్తిగా వదిలేయడం, సాత్విక జీవన విధానాన్ని అనుసరించడం శని అనుగ్రహానికి దోహదపడుతుందనే నమ్మకం ఉంది. అయ్యప్ప స్వామి కూడా శనీశ్వరునికి భక్తులు మండల కాలంలో కష్టాలను సహిస్తూ ఆచారాలను పాటిస్తారనే మాట ఇచ్చాడని చెబుతారు.
నల్లని దుస్తులకు శాస్త్రీయ కారణాలు
శబరిమల యాత్ర ఎక్కువగా అడవుల గుండా సాగుతుంది. నల్ల దుస్తులు అడవి వాతావరణంలో రక్షణ కలిగిస్తాయి. అదనంగా చలికాలంలో నల్లరంగు శరీరానికి వేడి నిల్వచేస్తుంది.
ఆరోగ్య పరమైన ప్రయోజనాలు
-
నేలపై నిద్రించడం వెన్నునొప్పి తగ్గించడంలో తోడ్పడుతుంది
-
కండరాలు బలపడుతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది
-
తెల్లవారుజామున స్నానం చేయడం నాడీవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది
-
శాకాహారం తీసుకోవడం శరీరానికి శుభ్రత, తేలిక గలుగుతుంది
-
ప్రతిరోజూ పూజలో పాల్గొనడం మానసిక ప్రశాంతతను పెంచుతుంది
