National

Kharga Kamikaze : సూసైడ్ డ్రోన్.. ఇండియన్ ఆర్మీ కొత్త ఆవిష్కరణ

What is Kharga Kamikaze? All about Indian Army’s high-speed ‘suicide’ drone

Image Source : X

Kharga Kamikaze : భారత సైన్యం ఖర్గా కమికేజ్ డ్రోన్ అని పిలుచుకునే కొత్త హై-స్పీడ్, తక్కువ ఖర్చుతో కూడిన వైమానిక వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది ఇంటెలిజెన్స్, నిఘా పాత్రలలో మోహరించే సామర్థ్యం గల ఏరో సిస్టమ్. డ్రోన్ తక్కువ బరువున్న వైమానిక వాహనం. ఇది సెకనుకు 40 మీటర్ల వేగంతో ఉంటుందని ఒక అధికారి తెలిపారు.

ఖర్గా డ్రోన్ 700 గ్రాముల వరకు పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. హై డెఫినిషన్ కెమెరాతో పాటు నావిగేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఓ నివేదిక ప్రకారం ఇది శత్రు విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్ జామింగ్‌కు ప్రతిఘటనలను కలిగి ఉంటుంది. దీని పరిధి సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు.

ఇది దాదాపు రూ. 30,000 వ్యయంతో నిర్మించారు. నిఘా కోసం అలాగే శత్రు దళాలపైకి కామికేజ్ దాడుల కోసం మోహరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఖర్గా డ్రోన్ శత్రు రాడార్‌లను గుర్తించకుండా తప్పించుకోగలదు. ఒక రకమైన ‘సూసైడ్’ డ్రోన్‌లుగా పేరొందిన ఇది శత్రు లక్ష్యాలను సులభంగా ధ్వంసం చేయగలదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇలాంటి డ్రోన్‌లను ఉపయోగించారని ఓ అధికారి తెలిపారు.

అంతకుముందు, ఇండియన్ ఆర్మీకి చెందిన ఖర్గా కార్ప్స్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ‘ఖర్గా శక్తి’ అనే రెండు రోజుల ఇంటిగ్రేటెడ్ ఫీల్డ్ ఫైరింగ్ వ్యాయామం విజయవంతంగా నిర్వహించింది. ఈ కాంప్రహెస్సివ్ ఎక్సర్ సైజ్ అనుకరణ యుద్దభూమి వాతావరణంలో సంయుక్త ఆయుధ కార్యకలాపాల ప్రభావాన్ని పరీక్షించడం, ధృవీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది.

Also Read : Railway Station : రైళ్లు ఎప్పుడూ ఆగని భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్

Kharga Kamikaze : సూసైడ్ డ్రోన్.. ఇండియన్ ఆర్మీ కొత్త ఆవిష్కరణ