Thar SUV: శుభమా అని కారు కొంటే.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడ్డ ఎస్‍యూవీ

Watch: Woman crushing brand new Thar Roxx from first floor of showroom while performing lemon-crushing ritual

Watch: Woman crushing brand new Thar Roxx from first floor of showroom while performing lemon-crushing ritual

Thar SUV: ఢిల్లీలో కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానకంగా మారిన సంఘటన జరిగింది. ఘజియాబాద్‌కు చెందిన మాని పవార్ అనే మహిళ ఇటీవల రూ.27 లక్షల విలువైన మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఆర్డర్ చేశారు. సోమవారం, భర్త ప్రదీప్ నిర్మన్‌తో కలిసి ఆమె నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్లి వాహనాన్ని స్వీకరించారు.

కొత్త వాహనం ఇంటికి తీసుకెళ్లే ముందు పూజ చేయాలనే ఉద్దేశంతో షోరూమ్‌లోనే నిమ్మకాయలు తొక్కించే కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ ఆనంద క్షణమే ప్రమాదానికి దారి తీసింది. పూజా కార్యక్రమం జరుగుతుండగా, మాని పవార్ అనుకోకుండా యాక్సిలేటర్ నొక్కడంతో థార్ ఒక్కసారిగా వేగం పెంచి షోరూమ్ మొదటి అంతస్తు నుంచి బయటకు దూసుకెళ్లింది. వాహనం గాజు అద్దాలను బద్దలుకొడుతూ కింద పేవ్‌మెంట్‌పై బలంగా పడిపోయింది.

ఆ సమయంలో వాహనంలో మాని పవార్, ఆమె భర్త ప్రదీప్ నిర్మన్, షోరూమ్ సిబ్బంది ఉన్నారు. ప్రమాదం తీవ్రంగా కనిపించినప్పటికీ ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం, గాయాలేమీ లేకపోయినా, ముందు జాగ్రత్త చర్యగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వీడియోలు కాసేపటికే వైరల్‌గా మారాయి. కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం ఒక్క క్షణంలోనే ఎలా భయంకర అనుభవంగా మారిందో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది.

ఈ ఘటనతో షోరూమ్‌లోనూ కలకలం రేగింది. వాహనం ధ్వంసమైనప్పటికీ ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నారు. స్థానిక మీడియా ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.

Also Read: Urea: యూరియా కోసం లైన్లో నిలబడి, స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు

Thar SUV: శుభమా అని కారు కొంటే.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడ్డ ఎస్‍యూవీ