Accident : మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున నాగ్‌పూర్‌కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. బార్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామన్‌పూర్ ఘాటి ప్రాంతంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని ఒక అధికారి ధృవీకరించారు.
బస్సు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుండి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసు అధికారి ప్రకారం, ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
మృతులను హైదరాబాద్‌కు చెందిన మాల్మా (45), నాగ్‌పూర్‌కు చెందిన శుభం మెష్రామ్ (28), అమోల్ ఖోడే (42)గా గుర్తించినట్లు పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం లఖ్నాడాన్ పట్టణం, జబల్‌పూర్ నగరంలోని ఆసుపత్రులకు తరలించారు.