Hanuman Temple : ఉత్తర్ ప్రదేశ్ బాగ్‌పత్ జిల్లాలోని తహసీల్ బరౌత్ ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న బామ్నోలి గ్రామంలో ఒక మట్టిదిబ్బపై శ్రీ హనుమాన్ జీ చారిత్రాత్మక ఆలయం ఉంది.
వందల సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని నిష్ణాతుడైన మహారాజ్ మంగళేశ్వర్ నంద్ జీ గ్రామస్తుల నుండి విరాళాలు సేకరించి నిర్మించారు. దేవాలయం ఎత్తు 101 అడుగులు, దాని చుట్టూ 17 బిఘాలలో పచ్చని చెట్లు నాటారు. ఇది ఆలయ ప్రశాంత వాతావరణాన్ని మరింత పెంచుతుంది.
ఈ దేవాలయం యొక్క అతి పెద్ద విశేషం ఏమిటంటే ఇక్కడ గాలి, శబ్ద కాలుష్యం పూర్తిగా నిషేధించారు. ఇతర దేవాలయాలు, మసీదుల వలె ఇక్కడ లౌడ్ స్పీకర్లను ఉపయోగించరు.’
అంతే కాకుండా ఆలయంలో అగరబత్తీలు, దూద్ లను ఉపయోగించడం కూడా నిషేధించారు. ఇది వాయు కాలుష్యానికి కారణమవుతుంది కావున వీటిని నిషేధించారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని, కష్టాలను తొలగిపోతాయని నమ్ముతారు.
విశేషమేమిటంటే, ఈ ఆలయంలో ఎలాంటి విరాళం డిమాండ్ చేయరు. ఏ మతం, కులం లేదా వర్గాల వారు ఇక్కడికి రావచ్చు. ఆ విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవు.