హిమాలయాల్లోని మంచు కొండపై భారత సైనికులు ‘బహదూర్’ అనే ఎలుగుబంటి పిల్లను ప్రాణాలకు తెగించి కాపాడారు. ఆహారం కోసం వచ్చిన ఈ ఎలుగు తల ఓ డబ్బాలో ఇరుక్కుని ప్రమాదకరమైన కార్నిస్ (పెళుసుగా ఉండే మంచు అంచు)పై తిరుగుతోంది. కార్నిస్ విరిగిపోయే ప్రమాదం ఉన్నా ఓ సైనికాధికారి మోకాళ్లపై వెళ్లి దానిని సురక్షితంగా బయటకు లాక్కొచ్చారు. డబ్బాను తొలగించి ఆహారం ఇచ్చి విడిచిపెట్టగా అది వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది.
Army: ప్రాణాలకు తెగించి మూగజీవిని కాపాడిన జవాన్లు!
Thankyou, Indian Army': When Indian Army helped rescue 'Bahadur', the Himalayan bear cub with its head trapped in a canister
