Passowrd: ఎక్కువ మంది పెట్టుకునే పాస్‌వర్డ్స్ ఇవేనట!

Stop Using Every Password Now That's On This List

Stop Using Every Password Now That's On This List

 Passowrd: ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నా, చాలా మంది మాత్రం పాస్‌వర్డ్ విషయంలో ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. Comparitech సంస్థ పరిశోధకులు మొత్తం 200 కోట్లకు పైగా ఆన్‌లైన్ అకౌంట్లను విశ్లేషించి, ఎక్కువ మంది ఏలాంటి పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తున్నారో వెల్లడించారు.

ఆశ్చర్యకరంగా, ఇప్పటికీ చాలా మంది అత్యంత సులభమైన పాస్‌వర్డ్స్‌నే ఉపయోగిస్తున్నట్లు తేలింది. “123456” అనే పాస్‌వర్డ్‌ను ఒంటరిగానే దాదాపు 76 లక్షల మంది ఉపయోగిస్తున్నారని గుర్తించారు. అలాగే “Admin” అనే పాస్‌వర్డ్‌ను కూడా 19 లక్షల మంది వాడుతున్నారని తెలిసింది. ఇది మాత్రమే కాదు 123, 1234, 1234567890, password, India@123 వంటి సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లు ఈ ఏడాది కూడా చాలామంది అకౌంట్లలో కనిపించాయి.

నిపుణులు చెబుతున్నదేమిటంటే – ఇలాంటి పాస్‌వర్డ్‌లు హ్యాకర్లకు బంగారు అవకాశాలు. కొన్ని సెకన్లలోనే అకౌంట్‌ను బ్రేక్ చేయడం వీలవుతుంది. ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు, సోషల్ మీడియా, ఇమెయిల్ వంటి ముఖ్యమైన అకౌంట్లలో సాధారణ లేదా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లు పెట్టడం అత్యంత ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు.

ఎలా పాస్‌వర్డ్ పెట్టాలి?

  • పెద్ద మరియు చిన్న అక్షరాలు కలిపి వాడాలి

  • సంఖ్యలతో పాటు ప్రత్యేక చిహ్నాలు కూడా ఉండాలి (@, #, %, & వంటి)

  • కనీసం 10–12 అక్షరాల పొడవు ఉండాలి

  • పుట్టినరోజులు, పేర్లు, మొబైల్ నంబర్లు వాడకూడదు

డిజిటల్ భద్రత కోసం పాస్‌వర్డ్‌ బలంగా ఉండటం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: Ram Gopal Varma: చిరంజీవికి థాంక్స్.. క్షమాపణలు: RGV

 Passowrd: ఎక్కువ మంది పెట్టుకునే పాస్‌వర్డ్స్ ఇవేనట!