Viral: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఓ భయంకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తికి, రెండో భార్యతో జరిగిన ఘర్షణ ప్రాణాపాయ పరిస్థితి తెచ్చింది. భర్త మొదటి భార్యతో మాట్లాడటం సహించలేకపోయిన రెండో భార్య, ఆహారంలో మత్తుమందు కలిపి, అతను గాఢ నిద్రలో ఉండగా కత్తితో దాడి చేసి పురుషాంగాన్ని కోసేసింది. అలాగే పలుమార్లు పొడిచి, అక్కడి నుంచి పారిపోయింది.
జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మగల్‌గంజ్ గ్రామానికి చెందిన అన్సార్ అలీ 2011లో మొదటి భార్యను వివాహం చేసుకున్నాడు. కానీ విడాకులు ఇవ్వకుండానే 2025 మార్చిలో మరో మహిళ నజ్ని బానోను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం ఇద్దరు భార్యలకు తెలిసి తరచుగా గొడవలు జరుగుతుండటంతో, అన్సార్ రెండో భార్యతో వేరే ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అయినప్పటికీ నజ్ని బానో, అతను మొదటి భార్యతో మాట్లాడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించేది.
ఒక రోజు అన్సార్, మొదటి భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ రెండో పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇది విన్న నజ్ని బానో కోపంతో ప్లాన్ వేసి, ఆహారంలో మత్తుమందు కలిపింది. అనంతరం కత్తితో దాడి చేసింది. అతని అరుపులు విని కుటుంబ సభ్యులు చేరుకుని, రక్తసిక్తుడైన అన్సార్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నజ్ని బానోను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
