Viral Video: SBI ఆఫీసులో రొమాంటిక్ రీల్స్.. నెటిజన్ల ఆగ్రహం

SBI Manager video goes viral on social media

SBI Manager video goes viral on social media

Viral Video: సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రజల సమస్యలు పరిష్కరించే కేంద్రాలుగా ఉండాలి. సమస్యతో వచ్చిన వారికి బాధ్యతగల అధికారి సమయానికి స్పందించి పరిష్కారం చూపించాలి. కానీ కొందరు అధికారుల వ్యవహారం మాత్రం పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. పనిచేయాల్సిన సమయంలో ప్రజలను గంటల తరబడి ఎదురుచూయించి, వారి సమస్యలపై దృష్టి పెట్టకుండా, ఎప్పుడు పని అవుతుందో అడిగిన వారిపైనే అరిచడం, అధికార దుర్వినియోగం చేయడం వంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్‌కి మరో కోణం జత అయింది. పని సమయాన్ని పట్టించుకోకుండా, కార్యాలయంలోనే రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం మొదలైంది.

ఇదే తరహాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్‌లో జరిగిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ తన తోటి మహిళా సహోద్యోగినితో కలిసి ‘సారా సారా దిన్ తుమ్ కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే’ అనే పాటకు రీల్ చేశారు. మేనేజర్ కుర్చీలో కూర్చుని హావభావాలతో నటిస్తుంటే, వెనుక మహిళా ఉద్యోగి లిప్‌ సింక్‌ చేస్తోంది. ఆఫీస్‌లో కంప్యూటర్లు, ఫైళ్లు, అవార్డులు అన్నీ స్పష్టంగా వీడియోలో కనిపిస్తుండటంతో, పని సమయాన్ని ఇలా వృథా చేయడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఈ వీడియో బ్యాంకింగ్ సర్కిల్స్‌లో వేగంగా షేర్ అవుతూ ట్రెండ్ అవుతోంది. “పబ్లిక్ ఆఫీస్‌ను సినిమాల సెట్టుగా మార్చేశారా?”, “ఇందులో రొమాన్స్ కంటే బాధ్యతే ముఖ్యమని ఎవరైనా చెప్పాలి”, “ఇలా చేస్తే సస్పెన్షన్ తప్పదు” అంటూ అనేక కామెంట్లు వస్తున్నాయి.

Also Read: Passowrd: ఎక్కువ మంది పెట్టుకునే పాస్‌వర్డ్స్ ఇవేనట!

Viral Video: SBI ఆఫీసులో రొమాంటిక్ రీల్స్.. నెటిజన్ల ఆగ్రహం